- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే : బండి రమేష్..
దిశ, కూకట్పల్లి : మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఆది నుంచే కట్టుబడి ఉందని మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, కవి ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్‌కు మద్దతుగా అల్లాపూర్ డివిజన్లో 5 వేల మంది మైనారిటీలతో నిర్వహించిన సభకు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, కవి ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి, కర్ణాటక శివాజినగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్శద్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మైనారీటిలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 4 వేల కోట్ల బడ్జెట్‌తో మైనారిటి డిక్లరేషన్‌ను ప్రకటించిన ఘనత, ధైర్యం కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిందని అన్నారు. అదే విధంగా ఇమ్రాన్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మొహబ్బత్ భాయి చారేకే దివానే దిన్ హి లౌటాదో.. వో సస్తి దాల్, సబ్జికే సుహానే దిన్ హి లౌటాదో.. ఏ అచ్చే దిన్ తో అంబాని, అదానికో ముబారక్ హో.. హమే అయిసా కరో సాహెబ్ పురానే దిన్ హి లౌటాదో.. అంటు తన గానంతో అందరిని ఆకట్టుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే రిజ్వాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు మైనారిటీల పక్షాన ఉందని, కాంగ్రెస్ పార్టీ మైనారిటీలు తమ ఓటుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం అభ్యర్థి బండి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే పార్టీ దేశంలో ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి బీ టీం అని అన్నారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది బీజేపీ ఖాతాలో పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎన్నికల ఇన్చార్జి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, మైనారిటి నాయకులు ఎండి. మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.
అల్లాపూర్‌లోని కర్ణాటక ముస్లింలే టార్గెట్..
తెలంగాణ రాష్ట్రంలో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభావం అది ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతంలో ఉంటుంది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్, మూసాపేట్ ప్రాంతాలలో అత్యధికంగా కర్ణాకట రాష్ట్రానికి చెందిన వారు, ముఖ్యంగా బీదర్ పరిసర ప్రాంతాలకు చెంది వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో మైనారిటీలు ఏకతాటి పై కర్ణటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి భారి మెజారిటితో అందించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పై పడింది. ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, పార్టీలో ఎన్నికలలో పోటీ చేసేందుకే అభ్యర్థుల మధ్య పోటీ పెరగడం తెలిసిందే.
ఈ క్రమంలో కూకట్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న కర్ణాటక ప్రాంత వాసుల ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు, మైనారిటి నాయకులను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా మైనారిటి ఓట్లు ప్రాంతంలో అల్లాపూర్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లు ప్రధానంగా ఉంటాయి. ఈ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే విధంగా ఉంటాయనే అనవచ్చు. అల్లాపూర్ డివిజన్ మైనారిటీలు వేలాది సంఖ్యలో సభలో పాల్గొనడం, సభ విజయవంతం కావడం బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతుందనే చర్చ జరుగుతుంది.