- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడారం జాతర.. ల్యాప్ టాప్ ముందు కోళ్లతో వెరైటీ మొక్కులు
దిశ, డైనమిక్ బ్యూరో:ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తున్నారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి గద్దెలను దర్శించుకునేందుకు మేడారంకు వెళ్తుంటే జాతరకు రాలేని ఇళ్లలో నుంచే మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా విదేశాల్లో ఉన్న ఓ కుటుంబం వెరైటీగా వన దేవతలకు మొక్కులు చెల్లించుకోవరం ఆసక్తిని రేపుతున్నది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. యూకేలో ఉంటున్న ఓ కుటుంబం మేడారం సమ్మక్క సారక్క ఫోటోను ల్యాప్ టాప్ స్క్రీన్ పై ఉంచి ఆ ఫోటో ముందు బంగారం (బెల్లం), కొబ్బరికాయలతో పాటు రెండు కోళ్లను ఉంచి ఇంటిల్లిపాది పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ 'ఇది మన పండగ.. ఎల్లలు దాటినా, దేశాలు దాటిన ఖండాలు దాటిన మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు అందుకే అలా మేము సమ్మక్క చేసినం' అంటూ రాసుకొచ్చారు. ఈ వెరైటీ మొక్కులకు సంబంధించిన నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. వారిని ప్రశంసిస్తూ.. దేశం మారిన మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోలేదంటూ కామెట్స్ చేస్తూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.