- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లీష్ మీడియంలో బోధన సాధ్యమవుతుందా?
దిశ, చిన్నశంకరంపేట: వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేసింది. ద్వీభాష ఇంగ్లీష్/ తెలుగు బోధనకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. 1-8 తరగతి వరకు ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు భాషా బోధన పై దశలవారీగా కొన్ని రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తుంది. మొదటి శిక్షణలో భాగంగా వారం రోజుల క్రితం మండల కేంద్రంలోని మాడల్ స్కూల్ లో 70 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా ,శిక్షణ తీసుకున్న వారు మూడు దశల వారీగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకే సారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాధ్యమవుతుందా? ప్రభుత్వం ఇచ్చే కొన్ని రోజుల శిక్షణతో వారివారి సబ్జెక్టులకు ఏ మేరకు ఇంగ్లీష్ లో బోధించగలరూ! దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది ఆహ్వానించదగిన మార్పే కాని, సాధ్యాసాధ్యాలు వాటి అమలులో ఉన్న ఇబ్బందులపై ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా చేసిందని పలువురు విద్యావంతులు ఆరోపిస్తున్నారు. ఇంకా చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది. ఇప్పటికే కొన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న టీచర్లకు పెద్దగా సమస్య ఉండక పోవచ్చు. కానీ తెలుగు మీడియంలో చదువుకొని తెలుగులోనే బోధిస్తున్న టీచర్లకు మాత్రం ఇంగ్లీషులో అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల ఫిజికల్ ,కెమిస్ట్రీ, బయాలజీ, సబ్జెక్ట్ టీచర్లు ఉన్న ఫలంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయగలరనే దానిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వారు ఇంగ్లీషులో సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నిరంతర శిక్షణ కార్యక్రమాల రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు విద్యావంతులు.
మొదటి విడతగా 40 మంది విద్యార్థులకు శిక్షణ
చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధించడానికి 40 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు కనీసం భోజనం సౌకర్యాలు లేవు. టీ ,స్నాక్స్, నోట్ బుక్స్ లాంటి సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు. తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. దీంతో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమంలో నిరసన తెలిపారు. ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వచ్చే సంవత్సరం బోధన చేయాల్సి ఉంది. 50 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్ వినియోగం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఆంగ్ల బోధన ఎంత వరకు కొనసాగుతుందని వేచి చూద్దాం!