కోడ్ కూసిన రాత చెదరలే..!

by Sumithra |
కోడ్ కూసిన రాత చెదరలే..!
X

దిశ, దౌల్తాబాద్ : తెలంగాణ సాధారణ శాసనసభ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చి పదిహేను రోజులు కావస్తున్నా ఇప్పటికి మండల పరిధిలో కొన్ని గ్రామాలలో రాజకీయ నాయకుల వాల్ పెయింటింగ్స్ దర్శనమిస్తుండడం గమనార్హం. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో వాల్ పెయింటింగ్స్ చెరిపివేసి, రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు తొడిగిన సిబ్బంది, రాజకీయ వాల్ పెయింటింగ్స్ మాత్రం తుడిపెయ్యకపోవడం పై పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా చెర్పెస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed