నేషనల్ హైవేపై క్షణాల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలు

by samatah |
నేషనల్ హైవేపై క్షణాల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలు
X

దిశ, చిన్నకోడూర్ : కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడి ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీం నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. తాటిపాముల అరవింద్ (31)గోదావరిఖని సింగరేణి ఉద్యోగస్తుడు గత మూడు రోజుల క్రితం హైదరాబాదు తన నివాసంలో గృహప్రవేశం చేసుకొని తిరిగి హైదరాబాదు నుండి మంచిర్యాలకు ప్రయాణమయ్యాడు.

ఈ క్రమంలో చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి కారు చెట్టు ఢీకొని బోల్తా పడింది. కారునడుపుతున్న అరవింద్ మరణించగా, తల్లి కవిత భార్య నవ్య, అత్తమ్మ భారతి, పిల్లలు ఇమ్మాన్యూ కవితా శ్రీలకు గాయాలయ్యాయి. వీరిని గ్రామస్తులు కారులో నుండి బయటకు తీస్తున్న తరుణంలో చిన్నకోడూరు నుండి ఇబ్రహీం నగర్ వెళ్తున్న స్కూలు ఆటో ప్రమాదం జరిగిందని గమనించి .ఆటో నెమ్మదిగా వెళుతుంది. సిద్దిపేట నుండి కరీంనగర్ వెళుతున్న కారు అతివేగంగా వచ్చి ఆటో ను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు భాను ప్రకాష్ ,రెడ్డి అశోక్ రెడ్డి ,అంబికలకు తీవ్ర గాయాలయ్యాయి భాను ప్రకాష్ భారతిని హైదరాబాద్ మెరుగైన వైద్యం కోసం తరలించారు. సంఘటన స్థలాన్ని రూరల్ సిఐ జానకి రామ్ రెడ్డి సందర్శించారు.

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి

ఇబ్రహీం నగర్ గ్రామ శివారులో జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. జిల్లా వైద్యాధికారి కాశినాత్ కు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ఆయన వెంట బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తదితరులు ఉన్నారు

_ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

Advertisement

Next Story

Most Viewed