- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం.. ఎందుకంటే ?
దిశ, సదాశివపేట: సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డికి అభద్రతా భయం పట్టుకుందని మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిల మల్లన్న ఆరోపించారు. సదాశివపేట పట్టణంలోని పంచా చార్య బసవ సేవా సదన్ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. శుక్రవారం నాడు పేట మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రివ్యూ నిర్వహించి ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో 25 కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధికి కేటాయించిన సంగతి తెలిసిన విషయమే. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడడం, నిధుల కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది కౌన్సిలర్ లకు మాత్రమే ఇవ్వాలని అనడం సిగ్గుచేటన్నారు. మూడు సార్లు సంగారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి చేసింది ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.
2014 నుండి పట్టణం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు పట్టణ ప్రజల దాహం తీర్చడానికి మిషన్ భగీరథ పథకం ద్వారా 123 కిలోమీటర్ల పైప్ లైన్, 8 ట్యాంకులు రూ. 40 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాన్ని మినీ ట్యాంక్ బండ్‌గా మార్చి, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన బస్టాండ్ భవనం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఇతర అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసింది ఏముందో నిరూపించాలని సవాల్ విసిరారు. పార్టీలకతీతంగా అభివృద్ధి జరుగుతుంటే కౌన్సిల్ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జగ్గారెడ్డి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ విశ్వనాథన్ మండిపడ్డారు. జిల్లా మంత్రి హరీష్ రావు సహకారంతో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పట్టణ అభివృద్ధికి 25 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించారని కొనియాడారు. పార్టీలకతీతంగా అభివృద్ధి జరగాలని మా నాయకుడు చింత ప్రభాకర్ మాకు సంస్కృతి నేర్పారని అన్నారు. కౌన్సిలర్‌ల మధ్య కొట్లాటలు పెట్టే మాటలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దాపూర్ శివారులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని పట్టాలు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందన్నారు. స్థానికంగా అద్దెకు ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కట్ చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేయించిందని తెలిపారు. కౌన్సిలర్ చౌదరి ప్రకాష్ మాట్లాడుతూ.. పట్టణంలో 26 వాడలకు నిధులు సమానంగా కేటాయించడం జరిగిందని వివరించారు. అభివృద్ధి అనేది అందరికీ సమానమేనని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో పిల్లిగుండ్ల వీరేశం, కౌన్సిలర్లు ఇంద్ర మోహన్ గౌడ్, ముబీన్, కో ఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య టిఆర్ఎస్ నాయకులు వాదోని రాజు, శివ, ప్రదీప్ జైన్,ఖాజా, నజీర్ తదితరులు పాల్గొన్నారు.