- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడలను ఘనంగా నిర్వహించాలి : మంత్రి హరీష్ రావు
దిశ, సంగారెడ్డి : గత సంవత్సరం, ఈ సంవత్సరం స్పూర్తితో వచ్చే సంవత్సరం పదిఫలితాలలో రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. శనివారం పదవ తరగతి ఫలితాలు, చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతి పై జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవతరగతి రిజల్ట్స్ లో 147 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండు మండలాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన 110 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చాయని, ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగలన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు.
విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. త్వరలో 10 తరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు, వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు అభినందన సభ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు సూచించారు. చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించుకుందామని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీఠ వేస్తున్నదని, యువతకు చదువుతో పాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో, 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించు సీఎం కప్ క్రీడా పోటీలకు అన్నిఏర్పాట్లు చేయాలన్నారు.
నేను కూడా జిల్లాస్థాయి టోర్నీ పాల్గొంటానని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు యువతను భాగస్వామ్యం చేయడంలో చొరవ చూపాలన్నారు. మండల స్థాయిలో రాణించిన వారిని జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసే అవకాశం ఉండడంతో తమ ప్రతిభను చాటేందుకు యువతకు మంచి అవకాశమన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో సీఎం కప్ టోర్నీలు మండల స్థాయిలో జరుగనున్నాయని, ఇందులో భాగంగా అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారని, మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయిల్లో అవకాశం కల్పిస్తారన్నారు.
అట్టహాసంగా సీఎం కప్ ను నిర్వహించాలని, బ్యాన్సర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏ రోజు కారోజు రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు సకాలంలో ధాన్యం డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, ప్యాక్, ఏఎంసీ చైర్మన్లు, సంబంధిత అధికారులందరూ యాక్టివ్ గా ఉండి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరితగతిన జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టుగా తరుగు తీయకుండా చూడాలన్నారు.
జొన్నలు, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, డీసీఎంఎస్, డీసీసీబీ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ లు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డీఈఓ, జడ్పీహెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్, ఎంఈఓ లు, ఆర్సీఓలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, ధాన్యం కొనుగోలు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, ప్యాక్స్, ఏఎంసీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖల అధికారులు, సిబ్బంది, డీటీసీఎస్, సీసీలు, డిపిఎంలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, ఎమ్మెస్ ఓ లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.