పటాన్ చెరు ప్రాంతంలో ఐటీ దాడుల కలకలం.. కొనసాగుతున్న ఐటీ సోదాలు

by Vinod kumar |   ( Updated:2023-01-04 13:49:16.0  )
IT Rides In Power Make Corporate Office
X

దిశ, అమీన్ పూర్: పటాన్ చెరు ప్రాంతంలో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఎక్సెల్ దాని అనుబంధ పరిశ్రమ విలాస్ పొలిమేరాస్ రెండు కంపెనీలతో పాటు బొల్లారంలోని ఎక్సెల్ పరిశ్రమలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య కంపెనీల్లో ఐటీ అధికారులు కంపెనీకి సంబంధించిన పలు ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వేల‌ కోట్ల లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సోదాలు ఎప్పటి వరకు కొనసాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Next Story

Most Viewed