ఫైరింగ్ శిక్షణలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యూహాలను నేర్చుకోవాలి : సీపీ అనురాధ

by Aamani |
ఫైరింగ్ శిక్షణలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యూహాలను నేర్చుకోవాలి : సీపీ అనురాధ
X

దిశ,నంగునూరు : శిక్షణ ద్వారా సిబ్బందికి వ్యూహాత్మక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంతో పాటు వ్యూహాత్మకంగా ఆలోచించడం నేర్పింపబడుతుందని దీంతో పోలీసులు ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు కలుగుతుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. నంగునూరు మండలం రాజ గోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజ్ లో భాగంగా పోలీస్ అధికారులకు 9 ఎం ఎం పిస్టల్, ఇతర వెపన్స్ తో ఫైరింగ్ చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది ఎస్ ఎల్ ఆర్ ఇన్సాస్ వెపన్స్ తో ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేస్తున్న అధికారులు సిబ్బంది ఫైరింగ్ విధానాన్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శిక్షణ ద్వారా సిబ్బందికి వ్యూహాత్మక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంతో పాటు వ్యూహాత్మకంగా ఆలోచించడం నేర్పబడుతుందన్నారు.

దీంతో పోలీసులు ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు కలుగుతుంది అని అన్నారు. పోలీసు విధుల నిర్వహణలో, శాంతి భద్రతల రక్షణలో సాంకేతికత తో పాటు ఆయుధ పరిజ్ఞానం అవసరం ఉంటుందని తెలిపారు. పోలీసు సిబ్బంది అందరూ ఫైరింగ్ చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరిచేందుకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.శిక్షణలో నేర్పించిన మెలకువలను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని అభినందించి త్వరలో రివార్డు, అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఆర్ఐలు విష్ణు ప్రసాద్, ధరణి కుమార్, రాజేష్, కార్తీక్ ఆర్ఎస్ఐలు, రంజిత్, బాలకృష్ణ, సాయి చరణ్, నిరంజన్ ఫైరింగ్ ప్రాక్టీస్ లో అధికారులకు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు సూచనలు చేస్తూ ఫైరింగ్ ప్రాక్టీస్ విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు . ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న అధికారులు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, సతీష్, పురుషోత్తం రెడ్డి, సుమన్ కుమార్, రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, ఇన్స్పెక్టర్లు సీఐలు ఎస్ఐలు, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed