సైనికులై కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి

by Disha Web Desk 15 |
సైనికులై కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి
X

దిశ,పటాన్ చెరు : యువ నేతలంతా సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సురభి పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే యూత్ కాంగ్రెస్ పనిచేసిందో? ఈ పార్లమెంట్ ఎన్నికలలో మరింతగా శ్రమించి అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీసులో మెదక్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు.

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సురభి, ఎంపీ అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి, దుబ్బాక, పటాన్ చెరు నేతలు తూర్పు జయరెడ్డి, ఆకాంక్ష, నరేష్ యాదవ్, నర్సాపూర్, గజ్వేల్, మెదక్, సిద్దిపేట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురభి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎన్ఎస్యూఐ తో పాటు యూత్ కాంగ్రెస్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో పనిచేయాలన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు నెలల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ అమలు చేయబోతున్న ఐదు యువ గ్యారెంటీలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లేలా చూసి, ప్రజలకు వాటిని వివరించాలని సూచించారు. యువనేతలంతా శ్రమిస్తే మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు.

ఎంపీగా గెలిపిస్తే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా : ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం తాను ఎంఎన్ సీ కంపెనీలతో మాట్లాడి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని తెలిపారు. అలాగే పార్లమెంటు పరిధిలోని గ్రామాలలో ఫిర్యాదుల బాక్స్​ను ఏర్పాటు చేసి తద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని రైతులకు న్యాయం జరిగేలా కన్వెన్షన్ జోన్ నుండి ఆర్ వన్ జోన్ కి మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకోసం దీనిపై ప్రత్యేకంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి దాని అమలుకు చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్త ఓటర్లను ఈ ఎన్నికలలో చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ గ్రామానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను యూత్ కాంగ్రెస్ తీసుకెళ్లేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిధిలోని మండలాల యూత్ ప్రెసిడెంట్లు,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed