- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వానికి వారధిలా ఉండాలి : మంత్రి పొన్నం
దిశ, కోహెడ : దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. కోహెడ మండల పెద్ద సముద్రాల గ్రామంలో వీరభద్ర స్వామి దర్శనం అనంతరం దేవస్థాన ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా "దిశ " దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు "దిశ " దిన పత్రిక మరింత చేరువ కావాలన్నారు.క్షణాల్లో ప్రజలకు సమాచారం అందిస్తున్న దిశ పత్రిక ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రజలు చేరవేస్తూ అనతి కాలంలోనే డిజిటల్ యుగంలో ప్రజల మెప్పు, ప్రజాదరణ పొందిన ఏకైక పత్రిక దిశ అని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం,అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే విధంగా దిశ వార్త కథనాలు ఉండాలని అన్నారు."దిశ " యాజమాన్యానికి, రిపోర్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో.. దిశ జర్నలిస్టు సర్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, ఏఎంసీ చైర్పర్సన్ బోయిన నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు బసవరాజు శంకర్, చింతకింది శంకర్, శెట్టి సుధాకర్, పిల్లి రాజయ్య,భీమ్ రెడ్డి మల్లారెడ్డి, గోరిట్యాల లక్ష్మణ్,కర్ర రవీందర్, పొన్నం సత్యం, కాంతాల శివారెడ్డి, బీనవేని రాకేష్, బందెల బాలకిషన్, వేల్పుల వెంకటస్వామి, మోటం విజయ, అంకుష్, చేపూరి శ్రీశైలం, దూలం శీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.