ఆత్మగౌరవమే నినాదంగా ముందుకు సాగుతున్న : నీలం

by Naresh |   ( Updated:2023-11-21 16:16:58.0  )
ఆత్మగౌరవమే నినాదంగా ముందుకు సాగుతున్న : నీలం
X

దిశ, పటాన్ చెరు: సబ్బండ వర్గాల ఆత్మగౌరవమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం పటాన్ చెరు మండలం పాశం మైలారం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ... బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా సబ్బండవర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చడానికి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నానని తెలిపారు. తనకు ప్రజలంతా ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డగా పాశమైలారం గ్రామంలో తిష్ట వేసిన సమస్యలన్నీ తన దృష్టికి వచ్చాయన్నారు. తాను గెలిచిన వెంటనే గ్రామంలో ఉన్న నీటి సమస్య, కరెంటు సమస్య, విద్యార్థులకి బస్సు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీ ఇంటి బిడ్డ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీఎస్పీలో కొనసాగుతున్న చేరికలపర్వం..

పటాన్ చెరు బీఎస్పీలో నాయకుల చేరికల పర్వం కొనసాగుతోంది. బీసీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి బీఎస్పీ టికెట్ కేటాయించడంతో పెద్ద ఎత్తున నాయకులు బీఎస్పీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అమీన్ పూర్‌కి చెందిన బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ సదువు మల్లేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. కిష్టారెడ్డిపేటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు పెంటేష్ బృందం సైతం నీలంకు జై కొట్టి బీఎస్పీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీలో బహుజన వర్గాల నాయకులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనుల ఆత్మగౌరవమే ఎజెండాగా ముందుకు వచ్చిన నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్యేగా గెలిస్తే అన్ని వర్గాలకు గౌరవంతో పాటు అభివృద్ధి సాధ్యమని వివరించారు. తామంతా సైనికులుగా పనిచేసి నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ కి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story