- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Repair : పల్లె రహదారులు అధ్వానం..వర్షాలతో పూర్తిగా ధ్వంసమైన రోడ్లు
దిశ,ఝరాసంగం: రహదారులను అభివృద్ధికి సూచికగా భావిస్తారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు, వాహనదారులకు నరకప్రాయంగా మారాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు నానా అవస్థలకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసమై ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వనంపల్లి నుంచి సిద్దాపూర్ మీదుగా ఝరాసంగం వరకు వెళ్లే రహదారి ధ్వంసమై ప్రయాణికులకు నరకయాతన చూపిస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్లపై ఉన్న గుంతలలో నీరు నిండడంతో ప్రయాణించాలంటే ప్రజలు జంకుతున్నారు.
మాచనూర్ నుంచి బర్దిపూర్ వరకు ఉన్న రోడ్డు గుంతల మయంగా తయారయింది. జీర్లపల్లి నుంచి చిలేమామిడి, కోహిర్ క్రాస్ రోడ్ వరకు ఉన్న రోడ్డుపై కంకర తేలింది. ఝరాసంగం నుంచి మేదపల్లి, ఈదులపల్లి రోడ్డు పాడైపోయింది. ఈదులపల్లి నుంచి దిగ్వాల్ వరకు కొంత మేరకు రోడ్డు వేసి మిగతాది వదిలేశారు. ఇక ఝరాసంగం నుంచి బొప్పన్ పల్లి, బోరేగావ్, జిర్లపల్లి వరకు వెళ్లే దారి అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి రోడ్ల మరమ్మత్తులను తక్షణమే చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ప్రయాణికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.