సింగూరు అభివృద్ధికి రూ.44.85 కోట్లు...

by Kalyani |
సింగూరు అభివృద్ధికి రూ.44.85 కోట్లు...
X

దిశ, అందోల్‌: సింగూరు ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన బడ్జెట్‌ సమావేశంలో సింగూరు ప్రాజెక్టు అభివృద్దికి ప్రభుత్వం రూ.44.85 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోలు నియోజకవర్గ పరిధిలో సింగూరు ప్రాజెక్టు ఉండడంతో అంచలంచెలుగా అభివృద్ది పనులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నది. దామోదర్‌ గెలుపొందిన కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ ఏర్పాటుకు రూ.168 కోట్లను మంజూరు చేయించారు.

ప్రస్తుతం ఈ పనులను చేపట్టేందుకు కాలువలతో పాటు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. అప్పట్లోనూ సింగూరు నీటిని సాగుకు అందించాలన్న లక్ష్యంతో దామోదర్‌ రాజనర్సింహ జోగిపేటలో 102 రోజుల పాటు దీక్షను చేపట్టగా, 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ హయాంలో 2006లో సింగూరు కాలువల నిర్మాణానికి రూ.88.99 కోట్లను, రాజనర్సింహ ఎత్తిపోతల పథకం ద్వారా రూ. 27 కోట్లను మంజూరు చేశారు. 2012లో కాలువ పనులు పూర్తి చేసుకుని 2013లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి చెరువులను కూడా నింపారు. కాలువలు, చెరువుల ద్వారా సుమారుగా 40 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేçస్తున్న రైతాంగం

సింగూరు ప్రాజెక్టు అభివృద్దికి ప్రభుత్వం నిధులను కేటాయించడంపై ఇక్కడి ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దామోదర్‌ రాజనర్సింహ సింగూరు ప్రాజెక్టుపై ప్రత్యేక చోరవ చూపడంతోనే కాలువల ద్వారా సాగు నీరు, పర్యాటక రంగంగా అభివృద్ది చెందడం, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగిందంటున్నారు. కాలువలకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింVŠ ఏర్పాటు చేయనుండడం వలన శాశ్వతంగా కాలువలకు ఏలాంటి ఢోకా ఉంటుందని చెబుతున్నారు.

Next Story

Most Viewed