- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉపాధిహామీ పథకంలో 50 శాతం పనులు కల్పించండి: కలెక్టర్ డాక్టర్ శరత్
దిశ, సంగారెడ్డి: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్ (ఉపాధి కూలీలకు)లో కనీసం 50 శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ శాఖల అధికారులతో పటాన్ చెరు, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబలైజేషన్, పనుల గుర్తింపు, షేల్ఫ్ ఆఫ్ వర్క్స్, గ్రామపంచాయతీ ట్యాంకర్ల వినియోగం, నర్సరీలు, మొక్కల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో యాక్టివ్ వేజ్ సీకర్స్ లో కనీసం 50 శాతం మందికి తప్పనిసరిగా ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలన్నారు. ఏ పనులు కావాలో వాటిని గుర్తించాలని, ఎప్పుడూ 20 పనులు షెల్ఫ్ లో ఉండాలన్నారు. కూలీలకు వెజ్ రేట్ పెరిగేలా పనులు జరగాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీఓలు ఎప్పటికప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించాలని, ఆయా అంశాలపై సమీక్షించాలని సూచించారు. లక్ష్యాన్ని సాధించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి గ్రామ పంచాయతీలోని నర్సరీలు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. ప్రతి బ్యాగులో మొక్క ఉండాలని, ఆ మొక్కలకు సంబంధించిన బోర్డు ఉండాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ సజావుగా ఉండాలన్నారు. వంద శాతం పన్ను వసూలు కావాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీఓ సురేష్ మోహన్, డీఎల్ పీఓలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.