రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు

by Naresh |
రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు
X

దిశ, అందోల్‌: చిన్నారులు పోలియో భారీన పడకుండా తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కలను వేయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 0–5 ఏళ్లలోపు 40 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరందరికి పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం జోగిపేటలోని ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పల్స్‌ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించడంలో చిన్నారుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయోద్దన్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, నేటీ నుంచి ఆశ, అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంలు ఇంటింటికి వేళ్లి చిన్నారులకు పోలియో చుక్కలను వేస్తారన్నారు.

0–5 సంవత్సరాల వయస్సున్న ప్రతి ఒక్క చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని మంత్రి ఆదేశించారు. ఆరు గ్యారంటీల్లో నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసామని మంత్రి అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్‌ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు, గృహ జ్యోతి, పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఆర్‌ చంద్రశేఖర్, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ గాయత్రీదేవి, చైల్డ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సంగారెడ్డి, ఆర్‌బీఎస్‌కే డాక్టర్‌ శ్రీనాథ్, చైల్డ్,హెల్త్‌ రాష్ట్ర అధికారి భానుకిరణ్ పలువురు పాల్గొన్నారు.

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో...




జిల్లా లయన్స్‌ క్లబ్‌ చైర్‌ పర్సన్‌ (పల్స్‌ పోలియో) ఎ.రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కార్యక్రమంలో మంత్రి దామోదర్‌ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్‌ సభ్యులను మంత్రి అభినందించారు. జోగిపేట పట్టణంలోని గృహ జ్యోతి లబ్దిదారులకు ఉచిత విద్యుత్‌ పంపిణీకి సంబంధించి జీరో బిల్లును అందజేశారు. లబ్దిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అంబులెన్స్‌‌ను ప్రారంభించిన మంత్రి



సదాశివపేట పరిధిలోని ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ వారు జోగిపేట ప్రభుత్వాసుప్రతికి అందజేసిన అంబులెన్స్ వాహనాన్ని మంత్రి సీ. దామోదర్‌ రాజనర్సింహ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో అంబులేన్స్‌ సేవలను వినియోగించుకొవాలని, రోగులకు అంబులేన్స్‌ను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అంబులేన్స్‌ను అందజేసిన ఎంఆర్‌ఎఫ్‌ యజమాన్యాన్ని మంత్రి అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed