సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రజలే బాసులు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.

by Shiva |
సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రజలే బాసులు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.
X

దిశ, వెబ్ డెస్క్ : రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రజలే బాసులని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. చేగుంట మండల పరిధిలోని చెట్ల తిమ్మాయిపల్లిలో దుబ్బాక నియోజకవర్గం నిర్వహిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శుక్రవారం రాత్రి ప్రజలతో మమేకమయ్యారు.

ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యా, ఉచిత వైద్యం ప్రజలకు అందించకుండా మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ సన్న బియ్యం అందజేస్తారని మాటలకే తప్ప చేతలకు సరిపోలేదన్నారు. కనీసం పాఠశాలలో కళాశాలలో సైతం సమయాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులైన బాగా చదువుకుంటారని పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పని చేసిన ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులే నియోజవర్గంలో కనబడుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసింది లేదని ఎద్దేవా చేశారు.

ముత్యం రెడ్డి కొడుకుగా శ్రీనివాస్ రెడ్డి గత 58 రోజులుగా ప్రతి గ్రమాయ తిరుగుతూ ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. 136 రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను తిరుగుతాడని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, వడ్ల నవీన్, మాజీ ఎంపీటీసీ స్వామి, స్టాలిన్ నర్సింలు, కాశబోయిన శ్రీనివాస్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story