Dry day : పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగాలు దరి చేరవు

by Sridhar Babu |
Dry day : పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగాలు దరి చేరవు
X

దిశ, మనోహరాబాద్ : ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారని డిప్యూటీ డీఎంహెచ్ ఓ డా. జ్ఞానేశ్వర్ ప్రజలకు వివరించారు. డ్రై డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని కాలకల్ గ్రామంలో పలువాడల్లో ఇంటి పరిసరాల పరిశుభ్రతను మనోహరాబాద్ పీహెచ్సీ డాక్టర్లు వికాస్, వినోద్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, స్థానిక ఏఎన్ఎంలు వరలక్ష్మి లతో కలిసి ఆయన పరిశీలించారు. పలు ఇళ్ల ముందు నీటి నిల్వలను పరిశీలించి పారబోయించారు. ఇండ్ల ముందు ఉన్న డబ్బాలలో

నిలువ నీటిలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు సోకి ఇబ్బందులు పడతారని ప్రజలకు సూచించారు. ఇంటి పరిసరాలలో దోమలు, ఈగలు వాలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం డివిజన్ పరిధిలో చేగుంట మండలంలోని ఓ తండాలో నాలుగు డెంగ్యూ కేసులు వచ్చాయని, ప్రస్తుతం అవి తగ్గు ముఖం పట్టాయి అన్నారు. ప్రతిరోజూ ఉదయం పూట చెత్త బండి ద్వారా మైకులు ఏర్పాటు చేసుకొని పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ అధికారులకు సూచించామన్నారు.



Next Story