వెంకట్రామిరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు

by Disha Web Desk 15 |
వెంకట్రామిరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు
X

దిశ, చిన్నకోడూరు : బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లక్ష ఎనబై వేల మెజార్టీతో గెలవడం ఖాయమని, ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్ తో కలిసి రంగనాయకపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా

ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, ఆ స్పందన చూస్తుంటే లక్ష ఎనభై వేల మెజారిటీ వెంకట్రామిరెడ్డికి ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుంచు రమేష్, కార్తీక్ రెడ్డి, దేవయ్య, ప్రసాద్, రమేష్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed