- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..ఎమ్మెల్యే
దిశ, దుబ్బాక : మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవనెని రఘునందన్ రావు అన్నారు. గురువారం హసన్ మీరపూర్, అప్పనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హసన్ మీరాపూర్ గ్రామం నుంచి అప్పనపల్లి విద్యుత్ ఉపకేంద్రం వరకు గుంతలతో, పిచ్చి మొక్కలతో ఉన్న మూడు కిలోమీటర్ల రహదారి పై నూతనంగా మట్టి రోడ్డు వేసేందుకు తన సొంత ఖర్చుతో చేస్తున్న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అప్పనపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.
గ్రామంలో 300 మీటర్ల మీద ఆగిన బీటీ రహదారి పనుల వల్ల వర్షాలకు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంబడె స్పందించి అధికారులతో మాట్లాడి మూడు, నాలుగు రోజుల్లో రహదారి పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్బర్పేట- బొంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బుత్ సభ్యులు, కొండే ఎల్లారెడ్డి, వినీత్ గౌడ్, పల్లె నేహాల్ గౌడ్, అరిగే కృష్ణ, నరేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.