మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

by Shiva |
మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
X

నిధలు మంజూరు చేయాలంటూ వినతి

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్, రామాయంపేట మున్సిపాలిటీగా చేయాలంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం కలిసి విన్నవించారు. నియోజకవర్గ జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీ రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరు కోసం సంబంధిత శాఖను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే పలు అంశాలపై చర్చించినట్లు ఆమె వివరించారు.

Advertisement

Next Story