- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు ఆశీస్సులు అందజేసిన మంత్రి హరీశ్ రావు..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతీ విద్యార్థికి పేరుపేరునా మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులు అందించారు. వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నందున విద్యార్థుల్లో మనోధైర్యం కల్పించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంకల్పం వల్లే గత ఏడాది సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో నంబర్ వన్ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలని మంత్రి హరీశ్‌రావు హితబోధ చేశారు. విద్యార్థులను ప్రొత్సహించడానికి ప్రతీ ఒక్కరికీ ఉత్తరం రాశానని, ఆ ఉత్తరాలు అందుకున్న విద్యార్థులు చాలా సంతోషపడ్డారని తెలిపారు.
పలుమార్లు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించడమే గాకుండా ప్రత్యక్షంగా సమీక్షలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అంతేగాకుండా విద్యార్థుల మానసిక, శారీరక ధృడత్వం ఉండేలా ప్రతీరోజు ఆల్పాహారం, ప్రత్యేక తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ కంటెంట్ విధానంతో పదో తరగతి విదార్థులకు ఆన్‌లైన్ విద్యను అందించి మరింత తోడ్పాటును కలిగించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యకు దిశానిర్ధేశం చేసే పదో తరగతి పరీక్షలను ప్రతీ విద్యార్థి సైతం బాగా రాయాలని, తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని మంత్రి ఆల్‌దిబెస్ట్ చెప్పారు.