మెడికల్ ఆఫీసర్లకు మెమో జారీ

by Sridhar Babu |
మెడికల్ ఆఫీసర్లకు మెమో జారీ
X

దిశ, పాపన్నపేట : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ హెచ్చరించారు. బుధవారం ఆయన పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్లు సారికా, ప్రదీప్ రావు ఇద్దరూ విధుల్లో లేకపోవడంతో ఒకరోజు జీతం నిలుపుదల చేస్తూ మెమో జారీ చేశారు. సమయానుగుణంగా విధుల్లో ప్రజలకు సేవలందించాల్సింది

పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై మండిపడ్డారు. డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్న నేపథ్యంలో మెడికల్ ఆఫీసర్లు ఇద్దరూ గైర్హాజరవడంతో ఆగ్రహించారు. సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరలా పునారావృతం అయితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రికార్డులు, మందులను తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట సీహెచ్ ఓ చందర్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story