వైభవంగా జగన్నాథ రథ యాత్ర

by Sridhar Babu |
వైభవంగా జగన్నాథ రథ యాత్ర
X

దిశ, సంగారెడ్డి : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ప్రచార కేంద్రం 'భక్తి యోగ సెంటర్ - సంగారెడ్డి' వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో జగన్నాథ రథ యాత్ర వైభవంగా నిర్వహించారు. ఆదివారం సంగారెడ్డిలోని మెయిన్ రోడ్ మీదుగా న్యూ బస్టాండ్ నుండి చౌరస్తా వరకు రథ యాత్ర కొనసాగింది. అశేష భక్త జన సందోహం పాల్గొన్న ఈ రథ యాత్ర జగన్నాథ నామస్మరణతో మార్మోగింది. సాయంత్రం పీఎస్ఆర్ గార్డెన్స్ లో జగన్నాథ, బలదేవ, సుభద్రలకు అలంకార సేవ, చప్పన్ భోగ నైవేద్య సమర్పణ, జగన్నాథ్ లీలలపై ప్రత్యేక ప్రవచనం, చిన్నారుల నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు కనులవిందుగా నిర్వహించారు. ఇస్కాన్ సీనియర్ భక్తులు శ్రీమాన్ ప్రేమ్ నర్తన్ ప్రభుజీ మాట్లాడుతూ జగన్నాథ

స్వామి వైభవం, కలియుగంలో హరి నామ సంకీర్తన ప్రాముఖ్యత, సంగారెడ్డి లో జరుగుతున్న భగవద్గీత ప్రచారం వంటి విశేషాలను వివరించారు. నట్ కట్ గోపాల్ మేళా ప్రదర్శన ద్వారా చిన్నపిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే అనేక వినోదభరిత ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభ్యులు జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, 27వ వార్డ్ కౌన్సిలర్ విజయలత నాగరాజు గౌడ్, 9వ వార్డ్ కౌన్సిలర్ లాడే మనీలా మల్లేశం, కార్యక్రమ నిర్వాహకులు, భక్తి యోగ సెంటర్ కో ఆర్డినేటర్ శ్రీమాన్ గజేంద్రనాథ్ ప్రభుజీ, హలధర ప్రేమ దాస్, ప్రేమ్ మహిమ దాస్, నీతి నిపుణ్ దాస్, రాధా కృష్ణ, అరుణ్, సతీష్, ప్రవీణ్, మురళి కృష్ణ, శ్యామల గౌరంగి మాతాజీ, రామ భద్ర రూప మాతాజీ, కమలా మాతాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed