- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Crime : మద్యం మత్తులో ప్రాణం తీసిన ఈత సరదా..
దిశ, పెద్ద శంకరంపేట్: మద్యం మత్తులో స్నేహితులతో పోటీపడి ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిన సంఘటన మంగళవారం పెద్ద శంకరంపేట కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… శంకరంపేట గ్రామానికి చెందిన మహమ్మద్ ఇలియాస్ (30) ఇందిరా కాలనీలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి బయటకి వెళ్లి అతని ముగ్గురు మిత్రులు నాందేడ్ యాదగిరి, ఎండి షాదుల్, సుల్తాన్ లతో కలిసి ఉషికే మడుగు వద్దకు వెళ్లి అక్కడ మద్యం సేవించి అనంతరం ఉసికెమడుగులో మిత్రులతో కలిసి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి మునిగి మరణించాడు అని తెలిపారు.
ఇలియాస్ కోసం ఉషికే మడుగులో గాలించినప్పటికీ చీకటి పడటంతో ఆచూకీ కనుగొనలేకపోయారు. మంగళవారం ఉదయం పెద్ద శంకరంపేట పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతుని తల్లి మహమ్మద్ హాసిమ్మ బేగం తన కుమారుడు ఇలియాస్ నీటిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడని అనుమానాస్పదం ఏమీ లేదని ఫిర్యాదులో పేర్కొంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్ తెలిపారు.