- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జోగిపేటలో మహిళా దొంగల హల్‌చల్.. చిత్తు కాగితాల పేరిట గల్లీల్లో తిరుగుతూ..
దిశ, అందోల్: రోడ్లపై పడి ఉన్న చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను తీసుకునేందుకు గల్లీల్లో సంచరిస్తూ, తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ మహిళలు దొంగతనాలకు పాల్పడిన సంఘటన జోగిపేట పట్టణంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగిపేట పట్టణంలోని 13వ వార్డులో కాసాల రాజేశ్వర్ ఇంట్లో ఈ నెల 23వ తేదీన (గురువారం) ముగ్గురు మహిళలు పట్టపగలు దొంగతనానికి పాల్పడ్డారు. రాజేశ్వర్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 23న బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి సంగారెడ్డికి వెళ్లాడు.
అదే రోజున ముగ్గురు మహిళలు పట్టపగలు ఆ కాలనీలో గోనె సంచులను వీపున వేసుకుని చిత్తు కాగితాలను, ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తున్నట్లు సంచరిస్తుండగా, ఇంటికి తాళం వేసి ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా తాళాన్ని తీసి ఇంట్లోకి చొరబడ్డారు. తాళం చెక్కు చెదరకుండా చాకచక్యంగా తీసి, లోనికి ప్రవేశించి, బీరువా తాళాన్ని తీసి, అందులోని 7 తులాల బంగారు ఆభరణాలు, రూ. 80 వేల నగదు, 22 తులాల పట్టగొలుసులను అపహరించి వెళ్లిపోయారు. ఇంటికి యాధావిధిగా తాళం వేసి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రికి చేరుకున్న రాజేశ్వర్ కుటుంబ సభ్యులు, బీరువాలో ఉండాల్సిన చేతివాచ్ బాక్స్ బయట ఉండడంతో అనుమానం వచ్చి శనివారం ఉదయం బీరువాను తెరిచి చూడగా, బంగారం, వెండి, నగదు అపహరణకు గురైన ట్లుగా గుర్తించారు.
ఇంటి ఆరుబయట ఏర్పాటు చేసిన సీసీ కెమోరాలను పరిశీలించి, గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ముగ్గురు మహిళలు ఇంట్లోకి చొరబడి, దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమోరాలో రికార్డు అయింది. ఈ విషయంపై బాధితుడు రాజేశ్వర్ జోగిపేట పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టపగలే మహిళలు దొంగతనానికి పాల్పడడంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.