మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Shiva |
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, చేగుంట: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మకరాజుపేటలో శుక్రవారం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయ ముఖ్య అతిథిగా హాజరై రంజాన్ ఉపవాస దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ, ముస్లింల ఐక్యత ఉందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ నాయకులు సయ్యద్ ఆకిత్ గౌరీ నయ్యర్, సదరు కమిటీ అధ్యక్షుడు మమ్మద్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హిదాయత్ గౌరీ, మామ సమద్ సాబ్, బాబు పటేల్, చేగుంట మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ కవిత విశ్వేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ జింక శ్రీనివాస్, ఉప సర్పంచ్ భాగ్య శంకర్ గౌడ్, లతీఫ్, ఆవాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story