విగ్రహాల వివాదం..దుబ్బాకలో ఘర్షణ వాతావరణం.

by Aamani |
విగ్రహాల వివాదం..దుబ్బాకలో ఘర్షణ వాతావరణం.
X

దిశ, మిరుదొడ్డి: దుబ్బాకలో విగ్రహాల ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి, స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక బస్టాండ్ ఆవరణలో భూమి పూజ చేసే క్రమంలో, అదే స్థలంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ రామలింగారెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం తో వివాదం నెలకొంది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించి, ఒకరిపై ఒకరు నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక పోలీస్ స్టేషన్ లో, మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొన్న సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఇరు వర్గాల నాయకులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed