నేను సరే..మీమామ కామారెడ్డిలో ఓడిపోలేదా...

by Disha Web Desk 15 |
నేను సరే..మీమామ కామారెడ్డిలో ఓడిపోలేదా...
X

దిశ, నంగునూరు : నేను సరే..మీమామ కామారెడ్డిలో ఓడిపోలేదా...అని మాజీ మంత్రి హరీష్ రావు కు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘు నందన్ రావు కౌంటర్ ఇచ్చారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు ఎలా గెలుస్తాడని దుష్ప్రచారం చేస్తున్న హరీష్ రావు...కేసీఆర్ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మండల పరిధిలోని కోనాయిపల్లి, భాషగూడెం, తిమ్మాయపల్లి, నర్మెట్ట, నంగునూర్ మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి స్థాయిలో బీజేపీ అభ్యర్థి పై ఓడిపోయిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. 35 సంవత్సరాలుగా సిద్దిపేట నియోజకవర్గం ఒకే కుటుంబం చేతిలో బంధీగా ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతికి నిదర్శనం కవిత తీహార్ జైలుకు వెళ్లడమే అన్నారు. హరీష్ రావు సైతం గోడమీద కుర్చోని పార్టీ మారేందుకు చూస్తున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఉద్యమ కారులకు పదవులివ్వకుండా మోసం చేసిన చరిత్ర హరీష్ రావుది అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశం బాగుకోసం జరుగుతున్నాయని, ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతిరావు, రజనీకర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, యాదమల్లు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed