భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

by Shiva |   ( Updated:2023-04-12 16:42:18.0  )
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
X

దిశ, టేక్మాల్: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన వెంకటాపురం విశ్వనాథం, లలిత దంపతులు. విశ్వనాథం మద్యానికి అలవాటు పడి ప్రతి రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. రోజు తాగితే.. ఆరోగ్యం చెడిపోతుందంటూ భార్య లలిత భర్త విశ్వనాథంను మందలించగా .. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విశ్వనాథం అదే రోజు రాత్రి గ్రామంలోని చిన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన భర్త విశ్వనాథం ఎంతసేపటికీ.. ఇంటికి రాకపోవడంతో భార్య లలిత కంగారుపడి విషయాన్ని బంధువులకు తెలిపింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఊరంతా వెతికినా.. ఎక్కడా జాడ లేదు. బుధవారం తెల్లవారుజామున చెరువు మెట్ల వద్ద విశ్వనాథం చెప్పులు, దుస్తులు కనిపించాయి. దీంతో బంధువులు చెరువులోకి దిగి చూడగా మృతుడి విశ్వనాథం మృతదేహం కనిపించడంతో గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు.

Advertisement

Next Story