గాలివాన బీభత్సం

by Disha Web Desk 15 |
గాలివాన బీభత్సం
X

దిశ,ఝరాసంగం : జిల్లాలో శుక్రవారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం విపరీతమైన ఎండతో అల్లాడిన ప్రజలు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుచోట్ల గాలితో కూడిన వాన కురిసింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని పలుచోట్ల భారీ వర్షానికి చెట్లు రోడ్లపై విరిగి పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బర్దిపూర్, మాచ్నూర్ గ్రామాల మధ్య చెట్లు పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణాపూర్ శివారులో చెట్లు రోడ్డు మీద పడ్డాయి. వర్షానికి పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

పిడుగుపాటుకు పశువులు మృతి

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని పొట్టి పల్లి గ్రామానికి చెందిన బంగ్లా దొడ్డి శ్రీశైలంకు చెందిన రూ. 80 వేల విలువ గల పాడి ఆవు, న్యాల్కల్ మండలం మామిడిగా గ్రామానికి చెందిన నసీర్ అలీ కి చెందిన లక్ష రూపాయలు విలువగల పాడి గేదె పిడుగు పడి మృతి చెందింది. ఈ విషయంపై బాధితులు మండల పశు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు.

Next Story

Most Viewed