25న సిద్దిపేటలో హోంమంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం

by Disha Web Desk 15 |
25న సిద్దిపేటలో హోంమంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం (ఈనెల 25న) సిద్దిపేట జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. అయితే మెదక్ పార్లమెంట్ పరిధి సిద్దిపేట జిల్లాలో బీజేపీ తొలిసభ కావడంతో కాషాయ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజక వర్గాల పరిధి 27 మండలాలు, సిద్దిపేట మున్సిపాలిటీ కలుపుకొని 30వేల మందితో సభ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు

సభ ఏర్పాట్లను మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెన్నమనేని రఘునందన్ రావు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఢిల్లీ నుంచి అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 11:10 లకు చేరుకుంటారు. 11:15 నిమిషాలకు హెలికాప్టర్ లో బయలు దేరి సిద్దిపేట కలెక్టరేట్ వద్ద గల హెలిప్యాడ్ కు 11: 45 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి 11:55 నిమిషాలకు చేరుకొని 12 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ప్రచారం ముగించుకొని తిరిగి హెలిప్యాడ్ వద్దకు 1:10 నిమిషాలకు చేరుకొని అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరకుని అక్కడి నుంచి భువనేశ్వర్ కు వెళ్తారని బీజేపీ నాయకులు షెడ్యూల్ వివరాలు వెల్లడించారు.



Next Story

Most Viewed