కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌లతో ప్రతిపక్షాలు విలవిల : హరీష్ రావు

by Naresh |   ( Updated:2023-11-23 13:38:29.0  )
కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌లతో ప్రతిపక్షాలు విలవిల : హరీష్ రావు
X

దిశ, సదాశివపేట: మంత్రి హరీష్ రావు ఎప్పుడు తన మాటలతో ప్రతిపక్షాలను ఇరుకునపెడుతుంటారు. సమయం దొరికితే చాలు ప్రతిపక్షాలకు సమాధానం దొరకని ప్రశ్నలను సంధిస్తుంటారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా గురువారం సదాశివపేట రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మితే మోసపోతాం అని, కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మొద్దు అని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని దుయ్యబట్టారు.

గులాబీ జెండా అధికారంలోకి రాకముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 2000 పెన్షన్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రూ. 5 వేలు ఇవ్వబోతున్నామన్నారు . నాడు నీళ్ళ కోసం ఎంతో గోస పడ్డామని పేర్కొన్న హరీష్ రావు, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ వాళ్లు 5 గ్యారెంటీలు అన్నారు, ఇప్పుడు అక్కడ ప్రజలు అగైయిపోయినం అంటున్నారు. మనం అగం కావద్దు అని పేర్కొన్నారు. కరోనా వచ్చినప్పుడు ప్రజలతో ఉన్నది బీఆర్ఎస్‌ అని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మితే.. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టే అన్నారు.



ఓటు అంటే ఐదేళ్ల భవిష్యత్‌ అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక సీటు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక సీటు మాత్రమే వస్తుందని జోస్యం చెప్పారు. ఒక సీటు వచ్చే బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారని.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే ప్రజలకు నమ్మకం. బీజేపీ వస్తే బోరు బావులకు మీటర్లు వస్తాయి. మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.25 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వలేదు. మీటర్లు పెట్టనందునే రూ.25 వేల కోట్లు ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండు ఒక్కటే. తెలంగాణలో 24 గంటల పాటు కేసీఆర్ సర్కార్ కరెంట్ ఇస్తుంటే.. కర్ణాటకలో 5 గంటలే కరెంట్‌ ఇస్తున్నామని డీకే శివకుమార్‌ చెబుతున్నారు. మీటర్లు, బిల్లు లేకుండా రైతులకు మేం 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం." అన్నారు.

Advertisement

Next Story

Most Viewed