Join the Congress : హరీష్ రావు ఇలాకాలో..బీఆర్ఎస్ కు షాక్

by Sridhar Babu |
Join the Congress : హరీష్ రావు ఇలాకాలో..బీఆర్ఎస్ కు షాక్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి గా విజయం సాధించి బీఆర్ ఎస్ పార్టీ లో చేరిన 43వ వార్డు కౌన్సిలర్ పయ్యావుల పూర్ణిమ ఎల్లం, 14 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అలకుంట కవిత, నాయకుడు అలకుంట మహేందర్ గురువారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గతంలో సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ వ్యవహార శైలిపై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం విధితమే. తాజా చేరికలతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ల సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరు కౌన్సిలర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.



Next Story