షేర్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఘరానా మోసం

by Kalyani |
షేర్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఘరానా మోసం
X

దిశ, తూప్రాన్ : ఆన్లైన్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించి రూ. 14,84,179 పొగొట్టుకున్న ఘటన తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… తూప్రాన్ కి చెందిన ఓ వ్యక్తి ప్రయివేటు ఉద్యోగం చేస్తూ.. జూలై 11న షేర్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టడానికి గూగుల్ లో సెర్చ్ చేయగా, వాట్సాప్ నంబర్ కి ఎస్ఎంస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మెసేజ్ రాగా అందులో పలు దఫాలుగా రూ.10,94,589 చెల్లించి అవసర నిమిత్తం తీయడానికి ప్రయత్నం చేస్తే రాలేదు. వారిని సంప్రదించగా మరల రూ. 3,89,589 చెల్లించాలని చెప్పడంతో నమ్మి అకౌంట్ ద్వారా పంపి డబ్బులు డ్రా చేయడానికి చూడగా మరల కొంత అమౌంట్ పే చేయాలని తెలుపడంతో మోసపోయని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానంద తెలిపారు.

Next Story

Most Viewed