- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ బాధితులకు నేనే అధ్యక్షున్ని.. ఈటేల రాజేందర్
దిశ, కొండపాక : కేసీఆర్ బాధితులకు నేను అధ్యక్షున్ని అని, నాకు దిక్కులేక గజ్వేల్ రాలేదు బాధతో వచ్చిన అని గజ్వేల్ బీజేపి అభ్యర్థి ఈటేల రాజేందర్ అన్నారు. కులానికి, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టేది భూతల్లి అని అన్నారు. ఆ భూమి మీద హక్కులు లేకుండా చేసినవాడు కేసీఆర్ అని, ధరణి తీసుకొచ్చి కంట్లో మట్టి కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు 16 సంవత్సరాలకు, 18 సంవత్సరాలకు పట్టాలు ఇస్తుంటే.. ఇక్కడ మాత్రం గుంజుకుంటున్నారని ఈటేల రాజేందర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో దుద్దెడ, రాంపల్లి, మర్పడగ, ఖమ్మం పల్లి, సిర్సనగండ్ల , కొండపాక గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్న కేసీఆర్ ఇచ్చారా అని డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అన్నారు కట్టించారా అని ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి ఇచ్చారా, 57 సంవత్సరాల పెన్షన్ ఇస్తా అన్నారు.. అది కాదు అసలు పెన్షన్ దిక్కులేదు అని మండిపడ్డారు. 2018 ఎన్నికల అప్పుడు నేనే జిమ్మిదార్ లక్షరూపాయల వరకు రుణమాఫీ చేస్తున్న అన్నారు. కానీ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మి, భూములు డబ్బులు తీసుకువచ్చి రుణమాఫీ వడ్డీలకు కట్టారు తప్ప అసలు తీరలేదు అని అన్నారు. ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేసిన పాపానికి పేదవారికి రూపాయి సాయం చేయకపోగా ఉన్న భూములు గుంజుకొని కూలీలుగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు క్రమం తప్పకుండా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇచ్చేది మేము అన్నారు. మన భూమికి మనమే డబ్బులు కట్టే దుస్థుతికి కారకుడు కేసీఆర్ కాదా అని ఏ గ్రామానికి పోయినా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామపంచాయతీ భవనాలు, స్మశాన వాటికలు, మహిళా సంఘాల భవనాలు నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలతో కడుతున్నారన్నారు. సొమ్ము కేంద్రానిది కానీ మేము ఇచ్చామని కేసీఆర్ చెప్పుకుంటున్నారు అని తెలిపారు. ఇక చాలు.. సరిపోయింది.. కేసీఆర్ ని ఓడగొడితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.