- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు రాజ్యమే.. సీఎం కేసీఆర్ ధ్యేయం : ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
దిశ, హుజూరాబాద్ : రైతు రాజ్యమే.. సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కనుకులగిద్దలో రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రైతును రాజును చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతుభీమా పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్, లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్దీవో హరిసింగ్, ఎంపీపీ ఇరుమళ్ల రాణి సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్లు ఆలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి, ఎడవల్లి కొండల్ రెడ్డి, దాసరి రమణారెడ్డి, ఏడీఏ సునీత, ఎంపీడీవో విజయలక్ష్మి, క్లస్టర్ పరిధిలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.