- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ఆరాటం : మాజీ మంత్రి బాబు మోహన్
దిశ, బెజ్జంకి: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పని తీరుతో ప్రజలు తీవ్ర గోస పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. బుధవారం బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో జరిగిన బీజేపీ ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైందని, అందుకే కేసీఆర్ అనేక కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఅర్కి బీజేపీ భయం పట్టుకుందని అందుకే బీజేపీపై పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
మండలంలోని తోటపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్య గోడు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 1500 ఎకరాలకు పైగా భూ సేకరణ చేపట్టి 100 ఎకరాల స్థలానికే ప్రాజెక్టును పరిమితం చేసి మిగతా భూమిని రైతులకు తిరిగి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. కేవలం ఓ బడా కంపెనీ నేతకు తిరిగి భూమి అప్పగించిన ప్రభుత్వం మిగతా నిరుపేద రైతులకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన ప్రకటనలు నీటి మూటలుగానే మిగిలిపోయాన్నారు. వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల హామీలను మంత్రి హరీష్ రావు విస్మరించారని తెలిపారు.
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తూతూ మంత్రంగా అందించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రసమయి మండలంలోని ఇక్కడి ప్రాంతంలో ఫామ్ హౌస్ తీసుకుని ఉంటున్నాడే తప్ప, బెజ్జంకి మండల అభివృద్ధి పై ఆలోచన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. బెజ్జంకి ని సిద్దిపేటలో కలుపుకున్న తర్వాత కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, బెజ్జంకి ప్రజానీకాన్ని గుర్తించకపోవడం తో నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి పై ఇచ్చిన వాగ్దానాలు, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలన ఏమిటో ప్రజలందరికీ అర్థమైందని రాబోయే రోజుల్లో తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం, దరువు ఎల్లన్న, అజయ్ వర్మ, అశోక్, రాజు, వరుణ్ రావు, అనిల్ రావు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : పేదల సంక్షేమాన్ని అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది.. MLC Kalvakuntla Kavitha