- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ మద్యం బాటిళ్ల పట్టివేత
దిశ, సంగారెడ్డి : డిఫెన్స్ బాటిళ్లలో నకిలీ మద్యాన్ని నింపి అమ్మకాలు చేపట్టే ప్రయత్నాలను మెదక్ జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ పోలీసులు భగ్నం చేశారు. కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు డిపెన్స్ బాటిళ్లను పోగుచేసి వాటిలో తక్కువ క్వాలిటీ కలిగిన మద్యాన్ని నింపారు. ఎవ్వరికి అనుమానం రాకుండా డిఫెన్స్ మద్యం బాటిళ్లలాగా తయారు చేసి తెలంగాణలో అమ్మకాలు చేపట్టడానికి బీదర్ జిల్లా నుంచి జహీరాబాద్ కు వచ్చారు. బీదర్-మెదక్ రహదారి, జహీరాబాద్ ప్రాంతంలో ఒక వాహనంలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బీదర్ కు చెందిన అంబుదాస్, అభిషేక్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చాలా చోట్ల డిపెన్స్ బాటిళ్లను జమచేసి వాటిలో నకిలీ మద్యం నింపి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవడానికి ఈ ప్రయత్నాలు చేశామని నిందితులు అంగీకరించారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ సీఐ పి.వీణారెడ్డి, సీ.హెచ్.చంద్రశేఖర్, ఎ.అనిల్ కుమార్ లు మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. నకిలీ డిపెన్స్ బాటిళ్లను పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, మెదక్ డిప్యూటీ కమీషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డిలు అభినందించారు.