- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీధి కుక్కల బెడద తప్పే దెన్నడు…!
దిశ, సదాశివపేట: పట్టణం, మండలం లోని పలు ప్రాంతాల్లో కుక్క ల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం మరో ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఫయాజ్ నగర్, రహిమత్ నగర్ కాలనీల్లో కుక్కల చేసిన దాడుల్లో 15 మంది పైగా పలువురికి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీశారు.
సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు, గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. గతంలో మున్సిపాలిటీల్లో కుక్కలను బందించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగింది. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువుల పైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెం బడిస్తుండడంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతా ల్లో తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు. మండలంలో దాదాపుగా ప్రతి గ్రామంలో సుమారు 200 నుంచి 300 వరకు, మున్సిపాలిటీల్లో సుమారు వెయ్యి వరకు కుక్కలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉంది.
మూగజీవాలపై దాడి..
పట్టణం, మండలం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కల దాడిలో పలువురికి చెందిన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు మృత్యువాత పడ్డ సంఘటనలు సైతం ఉన్నాయి. వారం రోజుల క్రితం మండలంలో పలు గేదెలు, ఆవుల పై కుక్కలు దాడి చేశాయి. సంబంధిత గేదెలు వికృత చేష్టలకు పాల్పడుతూ దారిన వెళ్ళే జనం పైన దాడులు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుక్కలు దాడి చేయడం వల్ల పదుల సంఖ్యలో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నట్లు అంచనా ఉంది.
భయపడుతున్న జనం..
కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. పలు గ్రామాల్లో వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు, గుంపులుగా సేద తీరుతున్నాయి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి పై కుక్కలు దాడికి పాల్పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
శునకాల బెడద నివారణకు చర్యలు : ఉమా, మున్సిపల్ కమిషనర్, సదాశివపేట
పట్టణంలో శునకాల బెడద నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే పలు వార్డుల్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు అవసరమైన చర్యలు చేపడుతున్నాము. మున్సిపాలిటీల్లో కుక్కలు టీకా వేయడం, చికిత్స లు చేయడంపై దృష్టి సారించాము. గతంలో మాదిరిగా మున్సిపాలిటీల్లో కుక్కలను బందించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చర్యలు తక్షణమే చేపడతాం.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.