- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది చీకటి ఒప్పందం..!
దిశ, మెదక్ ప్రతినిధి: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని, త్వరలో బహిర్గతం చేస్తామని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్‌లో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరు బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే.. మరొకరు బలహీనమైన అభ్యర్ధిని బరిలోకి రెండు పార్టీల నేతలు చీకటి మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని త్వరలోనే మీడియా ద్వారా బయట పడతామని చెప్పారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా మెదక్ లో మాత్రం బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆలే నరేంద్ర తర్వాత మళ్లీ మెదక్‌లో కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు.
రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిఘా వర్గాలు, వివిధ మాధ్యమాలు నిర్వహిస్తున్న సర్వేలు బీజేపీకే మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి మెదక్ పార్లమెంట్ సీటును నియోజకవర్గ ప్రజలు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేసి తనకు అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, శ్రీపాల్, ఎక్కల్ దేవి మధు, ఎంఎల్ ఎన్ రెడ్డి, నందా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.