- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మార్చి 10 వరకు కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయండి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
దిశ, మెదక్ ప్రతినిధి: నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ వరకు పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు, ఏజెన్సీ లకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి ఔరంగాబాద్ లో నిర్మిస్తున్న ఐడీఓసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సమయం, డబ్బు వృథా కాకుండా అన్ని శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 33 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో రూ. 59 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం నిర్మిస్తున్నామని అన్నారు.
వేసవి కాలం సమీపిస్తుండడంతో పాటు యాసంగి పంట కోట దశకు వస్తున్నందున మార్చి రెండవ వారంలోగా అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సీసీ రోడ్డును రెసిడెన్షియల్ క్వార్టర్స్ వరకు పొడగించాలని, అందుకు అవసరమైన నిధులకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షపు నీరు చక్కగా పారే విధంగా డ్రైనేజి నిర్వహణ ఉండాలని సూచించారు. భవన సముదాయంలో చక్కటి లాన్ ఏర్పాటు చేసి, డ్రిప్ సిస్టం ద్వారా వాటి నిర్వహణ కొనసాగిస్తూ ఆహ్లాద వాతావరణం కల్పించాలని ఉద్యాన శాఖాధికారికి సూచించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి వేప, రావి తదితర నీడనిచ్చే చెట్లతో పాటు పూలమొక్కలు పెంచవలసిందిగా జిల్లా అటవీ అధికారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, ఆర్ అండ్ బీ ఎస్ఈ వసంత నాయర్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏజెన్సీ నిర్వహుకులు రమేష్ చాబ్రా, డీఎఫ్ఓ రవి ప్రసాద్, ఉద్యాన శాఖాధికారి నర్సయ్య, మునిసిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, ఆర్ డీఓ సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.