- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..
దిశ, మెదక్ ప్రతినిధి : ఔరంగాబాద్ లో నిర్మిస్తున్న ఇంట్రిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణం పూర్తయి మిగిలిపోయిన చిన్నచిన్న పనులకు శ్రామికులను ఎక్కువగా పెట్టుకొని వారం రోజులలోగా పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఒక ప్రక్క మిగిలిపోయిన ప్రహారి గోడ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలనీ, చేసిన ఎలక్ట్రిషియన్ పనులను చెక్ చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 19 న నిర్వహించే తెలంగాణా హరితోత్సవం భాగంగా ఐడీఓసి ఆవరణలో ప్రజాప్రతినిధులు, అందరి అధికారుల భాగస్వామ్యంతో అందమైన మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ వసంత నాయక్, ఈఈ ఆర్కిపస్, డీఈఈ వెంకటేష్, కాంట్రాక్టర్లు తదితరులున్నారు.