- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Siddipet Collector : ఎంపీడీవోపై కలెక్టర్ ఆగ్రహం
దిశ,సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన సేవ కేంద్రం బ్యానర్ లేకపోవడంతో ఎంపీడీఓ రాఘవేందర్ రెడ్డి పై కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన సేవ కేంద్రం అని బ్యానర్ పెట్టకపోతే ప్రజలకు ఎలా తెలుస్తదని అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ వెంటనే బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిద్దిపేట రూరల్ ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన సేవ కేంద్రం విధులను తనిఖీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల కరెక్షన్ ను ఆన్ లైన్ చేస్తున్న విధానం పరిశీలించారు.గృహ జ్యోతి,మహాలక్ష్మి పథకాలకు సంబంధించి దరఖాస్తుదారులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా పాలన సేవ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అవసరమైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం బాల సదనం,సఖి కేంద్రం, భరోసా కేంద్రాలను కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. అదే విధంగా నూతనంగా నిర్మిస్తున్న బాల రక్షా భవన్ ను కలెక్టర్ మను చౌదరి పరిశీలించి మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేసి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు అందించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.