- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM KCR:చీకట్లను పారదోలి.. వెలుగులు పంచుతున్నాం..
దిశ బ్యూరో, సంగారెడ్డి : గత ప్రభుత్వాల హయాంలో పటాన్ చెరు ప్రాంతంలో విద్యుత్ సమస్యలతో పారిశ్రామిక వేత్తలు సమ్మెలు చేసేవారని, ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరాతో కార్మికులు మూడు షిప్టులు పనిచేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విజయాలకు ఇంతకంటే నిదర్శనం ఇంకా ఏం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో రూ.184 కోట్లత నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగల సీఎం మాట్లాడుతూ తెలంగాణ వస్తే చీకట్లు తప్పవని ఎన్నో అపోహలు సృష్టించారని గుర్తు చేశారు. చీకట్లను పారదోలి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల వెలుగులు పంచుతున్నామని సీఎం అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటింటికి మంచినీళ్ల సరఫరా, కేసీఆర్ కిట్టు ఇలాంటివి దేశంలో ఎక్కడ ఉండవని, కాలేశ్వరం నిర్మాణంతో కరువును లేకుండా చేశామన్నారు.
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 వేలుగా ఉండే బెడ్ల సంఖ్యను 50 వేలకు పెంచామని సీఎం వెల్లడించారు. గతంలో పాలించిన చంద్రబాబు లాంటి వారు కూడా తెలంగాణ ల ఎకరం భూమి అమ్మితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 50 ఎకరాలు వస్తాయని అన్నారని సీఎం గుర్తు చేశారు. సమైక్య శక్తుల కుట్రలు పటాపంచలు అయ్యాయని, పటాన్ చెరు వంటి ప్రాంతంలో ఎకరం రూ.30 కోట్లు పలుకుతున్నదన్నారు. మరో సారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని, మోసపోతె గోసపడతామని సీఎం ప్రజలకు ప్రత్యేకంగా విజ్హప్తి చేశారు. మరోసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ లోనే పటాన్ చెరు వరకు మెట్రో లైన్ నిర్మాణానికి మంజూరు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
పటాన్ చెరుకు వరాల జల్లు..
పటాన్ చెరుకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. పటాన్ చెరు వరకు మెట్రో లైన్ నిర్మాణం చేపట్టడంత పాటు కొల్లూరు లో డబుల్ ఇండ్లలో 2 వేల ఇండ్లను పటాన్ చెరు పేదలకు అందిస్తామన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళశాల మంజూరు, రాయసముంద్రం చెరువు ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలో రాయసముంద్రం చెరువును అభివృద్ధి చేయించాలని మంత్రి హరీష్ రావుకు సీఎం సూచించారు. అలాగే తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు చొప్పున, పటాన్ చెరు, భారతీనగర్, రామచంద్రాపురం జీహెచ్ఎంసీ డివిజన్లకు రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలోని 35 గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. పటాన్ చెరును రెవెన్యూ విడిజన్ చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు కూడా ప్రసంగించారు.