హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్

by Disha Web Desk 15 |
హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్
X

దిశ, నారాయణఖేడ్ : హిందూ సామ్రాజ్య స్థాపకుడు చక్రవర్తి శివాజీ మహారాజ్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం మానూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ మహారాజ్ అంత గొప్పవాడు అయ్యాడంటే తల్లి జిజాభాయి ఆయనకు పౌరుషాన్ని నూరిపోసిందన్నారు. తనని జాతి కోసమే కన్నానని, హిందూ ధర్మం నశిస్తుందని, దేశంలో ఔరంగజేబు దేవాలయాలు కూర్చాడని, హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారని తెలిపారు. దాంతో శివాజీ ఒక్కొక్క రాజ్యాన్ని

దక్కించుకున్నాడని అన్నారు. చత్రపతి శివాజీ సమర్ధమైన ప్రగతిశీల పౌర పరిపాలన స్థాపించారన్నారు. పరిపాలనలో పర్షియన్ స్థానంలో మరాఠీ, సంస్కృత భాషల వినియోగాన్ని ప్రోత్సహించాడు అన్నారు. విదేశీ దురాక్రమణదారులపైన దండెత్తి మన దేశ సాంస్కృతిక వారసత్వానికి రక్షణంగా ఉన్నాడన్నారు. శివాజీ మహారాజ్ బీజాపూర్ సైన్యాన్ని ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ప్రణాళిక సభ్యులు నగేష్ షెట్కర్, సాయిరాం, ఉపాధ్యాయులు గోవింద్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, డీలర్ అశోక్ రావు, శివాజీ యువసేన నాయకులు ఎమ్మెల్యే కు ఘన సన్మానం చేశారు.



Next Story

Most Viewed