- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మంకు తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
దిశ, సదాశివపేట: ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బుధవారం ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర చేనేత సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు ప్రభాకర్ తో ఖమ్మానికి తరలివెళ్లారు. అదేవిధంగా సదాశివపేట మండలంకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వెళ్లారు. ఖమ్మం సభ జయప్రదం చేయాలని ఆయన వారు అన్నారు. అదేవిధంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశం ఖమ్మం వైపు చూస్తోందని, బీఆర్‌ఎస్ సభకు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్‌సింగ్, పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ వంటి నేతలు వస్తున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.
Also Read: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు వేముల అరెస్ట్ తప్పదా..?