కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమమే: వైసీపీ నేత

by Jakkula Mamatha |
కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమమే: వైసీపీ నేత
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నేత(YCP Leader) బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీని వెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని.. లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక, సొంతగా గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని తెలిపారు. యూపీలో అంతమంది కుంభమేళాకు వచ్చిన ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని ఆయన చెప్పారు. తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede)లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రచారం కోసం తాపత్రయం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఈ తిరుపతి ఘటనను సుమోటోగా తీసుకోవాలంటూ చీఫ్ జస్టిస్‌కు తాను లేఖ సైతం రాశానని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

Next Story