చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

by Sridhar Babu |
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
X

దిశ, పాపన్నపేట : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ సూచించారు. మండల కేంద్రం పాపన్నపేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మండల స్థాయి క్రీడాకారుల ఎంపికలో భాగంగా మొదటి రోజు శుక్రవారం అండర్ 14, 17 బాలికలకు కోకో, వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మాట్లాడుతూ.. చదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమని, ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆహ్లాదం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, నోడల్ అధికారి ప్రతాపరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, నరేష్, ప్రభాకర్, రాజేందర్ పాల్గొన్నారు. పాపన్నపేటకు చెందిన నరేందర్ గౌడ్ ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు.

Advertisement

Next Story