- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
10 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలకు తులం వెండి నాణ్యం..
దిశ, ములుగు : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని స్వచ్ఛభారత్ స్వచ్ఛ తెలంగాణ నినాదంతో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ను వాడొద్దని ఎంపీటీసీ మమతా బాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. గురువారం మన ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ మమతా బాల్ రెడ్డి ఒక వినూత్నమైన ఆలోచనతో గ్రామంలో పాలిథీన్, ప్లాస్టిక్ వ్యర్థాలు అందజేస్తే.. బదులుగా వెండి నాణేలు అందజేస్తామంటూ ప్రకటించారు. ఈ కార్యక్రమం అనడంతో గ్రామంలోని వ్యర్ధ ప్లాస్టిక్ లను 10కేజీల ప్లాస్టిక్ ఒక వెండి నాణెంను ఉచితంగా అందజేశారు.
ఈ వినూత్నమైన ఆలోచనలు చూసి ఇతర గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా కొనియాల ఎంపీటీసీ మమత బాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛభారత్ లో భాగంగా గ్రామాల పరిశుభ్రతకు పెద్దపీట వేసుకున్నామని గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం తమవంతు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదమ్మ నర్సింగరావు, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.